| కీర్తనలు | త్యాగరాజు | జ్ఞానమొసఁగరాదా గరుడ గమన వాదా |
| గమనశ్రమ - రూపకము (షడ్విధ మార్గణి - రూపక) |
| పల్లవి: |
| జ్ఞానమొసఁగరాదా గరుడ గమన వాదా ॥జ్ఞా॥ |
| అను పల్లవి: |
| నీ నామముచే నామది నిర్మలమైనది ॥జ్ఞా॥ |
| చరణము(లు): |
| పరమాత్ముఁడు జీవాత్ముఁడు పదునాలుగు లోకములు నర కిన్నర కింపురుషులు నారదాది మునులు పరిపూర్ణ! నిష్కళంక! నిరవధి సుఖదాయక! వర త్యాగరాజార్చిత! వారము తాననే ॥జ్ఞా॥ |