| కీర్తనలు | త్యాగరాజు | తనయందే ప్రేమ యనుచు విరిబోణులు |
| భైరవి - చాపు |
| పల్లవి: |
| తనయందే ప్రేమ యనుచు విరిబోణులు తల తెలియక నాడెదరు త.. |
| అను పల్లవి: |
| అనయము మోహము మీఱఁగ కృష్ణుఁడు అందఱికన్ని రూపములెత్తి యాడఁగ త.. |
| చరణము(లు): |
| కొందఱి బంగారు కొంగులు బట్ట కొందఱి పదములు బాగుగ నెట్ట కొందఱి సొగసును గనులారఁ జూడ కొందఱి మనసుఁదెలిసి మాటలాడ త.. |
| కొందఱి యంకమునను బవ్వళింప కొందఱి పెదవులఁ బలుకెంపులుంచ కొందఱి తనువుల కరలీలసేయ కొందఱి వెనుకనిలిచి జడవేయ త.. |
| కొందఱి నుదుటఁ గస్తూరి బొట్టువెట్ట కొందఱి తళుకు చెక్కుల ముద్దుబెట్ట కొందఱి బాలిండ్లఁ బన్నీరు జిల్క కొందఱితో త్యాగరాజనుతుఁడు బల్క త.. |