| కీర్తనలు | త్యాగరాజు | తప్పి బ్రతికి పోవ - తరమా? రామ! కలిలో |
| తోడి - రూపకము |
| పల్లవి: |
| తప్పి బ్రతికి పోవ - తరమా? రామ! కలిలో ॥తప్పి॥ |
| అను పల్లవి: |
| ముప్పున విషయ తటాక - మున మునుగక దృఢ మనసై ॥తప్పి॥ |
| చరణము(లు): |
| కంచుమొదలు లోహధన - కనకములను జూచి విష మంచు మఱియు పెంచికనుచు - యెంచి యంటని మనసై ॥తప్పి॥ |
| నంగనాచుల మానగు - యంగవస్త్రముల బాగగు ముంగురులను గని యంత - రంగమునను యాశించక ॥తప్పి॥ |
| జాజి మల్లె మందార సరోజములను - మనసార రాజపథముచే త్యాగ - రాజనుతుని పూజించక ॥తప్పి॥ |