| కీర్తనలు | త్యాగరాజు | తలచినంతనే నా తనువేమో ఝల్లనెరా |
| ముఖారి - ఆది |
| పల్లవి: |
| తలచినంతనే నా తనువేమో ఝల్లనెరా ॥తలచి॥ |
| అను పల్లవి: |
| జలజవైరి ధరాది విధీంద్రుల చెలిమి పూజలందిన నిను నే ॥తలచి॥ |
| చరణము(లు): |
| రోటికిఁ గట్ట దగిన నీ లీలలు మూఁటి కెక్కువైన నీదు గుణములు కోటి మదన లావణ్యములైన సాటిగాని నీ దివ్యరూపమును ॥తలచి॥ |
| నిద్రాలస్య రహిత శ్రీరామ భద్రానిలజ సులభ సంసార చిద్రార్తిని దీర్చు శక్తిని విధి రుద్రాదుల నుతమౌ చరితంబును ॥తలచి॥ |
| పాద విజత ముని తరుణీ శాప మోద త్యాగరాజ వినుత ధరాప నాద బ్రహ్మానంద రూప వేదసారమౌ నామధేయమును ॥తలచి॥ |