| కీర్తనలు | త్యాగరాజు | దాచుకోవలెనా దాశరథి నీ దయ |
| తోడి - జంప |
| పల్లవి: |
| దాచుకోవలెనా దాశరథి నీ దయ దా.. |
| అను పల్లవి: |
| జూచువారలలోన చులకనే ననుఁజూచి దా.. |
| చరణము(లు): |
| కనికరము కాంతపైఁగలిగి ముద్దిడువేళ జనకజ నా మాటసమయమని బల్కితే దా.. |
| కరఁగి పదములవ్రాలఁ గని కరుణసేయువేళ భరతుఁడెంతో నన్ను భక్తుఁడని పల్కితే దా.. |
| నేమమునఁ బరిచర్య నేర్పును బొగడువేళ సౌమిత్రి త్యాగరాజునిమాట బల్కితే దా.. |