| తోడి - దేశాది |
| పల్లవి: |
దాశరథీ నీ ఋణముఁదీర్ప నా
తరమా పరమపావననామ దా.. |
| అను పల్లవి: |
ఆశదీర దూరదేశములను ప్ర
కాశింపఁ జేసిన రసికశిరోమణి దా.. |
| చరణము(లు): |
భక్తిలేని కవిజాలవరేణ్యులు
భావమెఱుఁగలేరని కలలోఁ జని
భుక్తిముక్తికల్గునని కీర్తనముల
బోధించిన త్యాగరాజుకరార్చిత దా.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - daasharathii nii R^iNamu.rdiirpa naa ( telugu andhra )