| హరికాంభోజి - ఆది |
| పల్లవి: |
| దినమణి వంశతిలక లావణ్య దీనశరణ్య ॥ది॥ |
| అను పల్లవి: |
మనవిని బాగుగా మదిని దలంచుచు
చనువున నేలు చాలుగాఁ జాలు ॥ది॥ |
| చరణము(లు): |
శర్వవినుత నను సంరక్షించను
గర్వమునేల గాచువారెవరే
నిర్వికారగుణ నిర్మల కరధృత
పర్వత త్యాగరాజసర్వస్వమౌ ॥ది॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - dinamaNi vaMshatilaka laavaNya diinasharaNya ( telugu andhra )