| కీర్తనలు | త్యాగరాజు | దేవ, శ్రీ తపస్తీర్థ పురనివాస, దేహి భక్తి మధునా |
| మధ్యమావతి - త్రిపుట |
| పల్లవి: |
| దేవ, శ్రీ తపస్తీర్థ పురనివాస, దేహి భక్తి మధునా ॥దేవ॥ |
| అను పల్లవి: |
| పావన ప్రవృద్ధ శ్రీమతి హృ ద్భవన సకలజగ దవన శ్రీమహా ॥దేవ॥ |
| చరణము(లు): |
| పాశహస్త గణేశ హరణ ప లాశనారినితేశ వరద కు శేశ యారిధరాశ రేభమృ గేశ సప్తఋషీశ దేవ ॥దేవ॥ |
| నీలగళ సుర జాల నుత నత ఫాలగిరీశ ఫాల కృ పాలవాల సుశీల గౌరీ లోల శివ మాం పాలయాద్భుత ॥దేవ॥ |
| నాగపూజిత నాగ దనుజ హ రా గమర్ధన వాగాధిప విను తా గణితగుణ రాగమదదూ రా ఘహర శ్రీ త్యాగరాజ ॥దేవ॥ |