| రీతిగౌళ - ఆది |
| పల్లవి: |
| ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా ద్వై.. |
| అను పల్లవి: |
చైతన్యమా విను సర్వసాక్షీ వి
స్తారముగాను దెల్పుము నాతో ద్వై.. |
| చరణము(లు): |
గగన పవన తపన భువనాద్యవనిలో
నగధరాజ శివేంద్రాది సురలలో
భగవద్భక్తవరాగ్రేసరులలో
బాగ రమించే త్యాగరాజార్చిత ద్వై.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - dvaitamu sukhamaa advaitamu sukhamaa ( telugu andhra )