| కీర్తనలు | త్యాగరాజు | నగుమోము గనలేని నా జాలిఁ దెలిసి |
| అభేరి - ఆది |
| పల్లవి: |
| నగుమోము గనలేని నా జాలిఁ దెలిసి నన్ను బ్రోవగ రాద? శ్రీరఘువర నీ ॥న॥ |
| అను పల్లవి: |
| నగరాజధర! నీదు పరివారులెల్ల ఒగి బోధన జేసెడువారలు గారె? యిటు లుండుదురే? నీ ॥న॥ |
| చరణము(లు): |
| ఖగరాజు నీ యానతి విని వేగ చనలేఁడో? గగనాని కిలకు బహు దూరం బనినాఁడో? జగమేలే పరమాత్మ! యెవరితోనీ మొఱలిడుదు? వగ చూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత! ॥న॥ |