| కీర్తనలు | త్యాగరాజు | నగుమోము గలవాని నా మనోహరుని |
| మధ్యమావతి - ఆది |
| పల్లవి: |
| నగుమోము గలవాని నా మనోహరుని జగమేలు శూరుని జానకీవరుని న.. |
| చరణము(లు): |
| దేవాదిదేవుని దివ్యసుందరుని శ్రీ వాసుదేవుని సీతారాఘవుని న.. |
| సుజ్ఞాననిధిని సోమసూర్యలోచనుని అజ్ఞానతమమును అణఁచు భాస్కరుని న.. |
| నిర్మలాకారుని నిఖిలాఘహరుని ధర్మాదిమోక్షంబు దయచేయు ఘనుని న.. |
| బోధతోఁ బలుమాఱుపూజించి నే నా రాధింతు శ్రీ త్యాగరాజసన్నుతుని న.. |