| కీర్తనలు | త్యాగరాజు | నన్ను కన్నతల్లి నా భాగ్యమా |
| సింధుకన్నడ - దేశాది (కేసరి - దేశాది) |
| పల్లవి: |
| నన్ను కన్నతల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికా ॥న॥ |
| అను పల్లవి: |
| కనకాంగి రమాపతి సోదరి కరుణించవే కాత్యాయని ॥న॥ |
| చరణము(లు): |
| కావు కావు మని నే మొఱబెట్టగా కరఁగదేమి మది కమలలోచని నీవు బ్రోవకున్న యెవరు బ్రోతురు స దా వరం బొసగు త్యాగరాజనుతె ॥న॥ |