| కీర్తనలు | త్యాగరాజు | నమ్మినవారిని మఱచేది న్యాయమా రామ |
| భైరవి - ఆది |
| పల్లవి: |
| నమ్మినవారిని మఱచేది న్యాయమా రామ ॥న॥ |
| అను పల్లవి: |
| కమ్మవిల్తుని గన్న మా చక్కని కల్యాణరామ నిన్ను ॥న॥ |
| చరణము(లు): |
| చిన్ననాఁటనుండి చిత్తము రా నడిచి ఎన్నరాని యూడిగము లెంచుచుఁ బూజించి నిన్ను ॥న॥ |
| ఆసమించి రామ నిన్నంతరంగముననుంచి వాసి వాని యనుచును వర్ణించుచును నెంతోనిన్ను ॥న॥ |
| భోగము లందువేళ బుద్ధి నీ యెడ నుంచే త్యాగరాజ సన్నుత తారకచరిత నిన్ను ॥న॥ |