| కీర్తనలు | త్యాగరాజు | నా మొఱలను విని యేమర వలెనా? పామర మనుజులలో |
| ఆరభి - దేశాది |
| పల్లవి: |
| నా మొఱలను విని యేమర వలెనా? పామర మనుజులలో ఓరామ ॥నా॥ |
| అను పల్లవి: |
| తోమర నారాచములై మనసుకుఁ దోచెనా? భక్తపాప విమోచన ॥నా॥ |
| చరణము(లు): |
| ఇభ రాజేంద్రుఁడు యెక్కువైన లంచమిచ్చినదేమిరా రామ సభలో మానము బోవు సమయంబున సతి యేమిచ్చెనురా ఓ రామ ॥నా॥ |
| భాగవతాగ్రేసర రసికావన జాగరూకుడని పేరే రాగ స్వరయుత ప్రేమ భక్త జన రక్షక త్యాగరాజ వందిత ॥నా॥ |