| కీర్తనలు | త్యాగరాజు | నాటి మాట మరచితివో? ఓ రామ! |
| దేవక్రియ - ఆది |
| పల్లవి: |
| నాటి మాట మరచితివో? ఓ రామ! చిన్న ॥నాటి॥ |
| అను పల్లవి: |
| మాటి మాటికి నాపై మన్నన జేయుచు యేటికి యోచన? నీ భాగ్యము నీదన్న ॥నాటి॥ |
| చరణము(లు): |
| తరుణుల బాగు నర్తనములఁ జూచువేళ చరణములను గని నేకరఁగుచు సేవింప భరతుని కర చామరమును నిల్పుచు కరుణను త్యాగరాజ వరదుఁడని పల్కిన ॥నాటి॥ |