| కీర్తనలు | త్యాగరాజు | నాదోపాసన చేసేశంకర నారాయణ విధులు వెలసిరి ఓమనసా |
| బేగడ - దేశాది |
| పల్లవి: |
| నాదోపాసన చేసే శంకర నారాయణ విధులు వెలసిరి ఓమనసా ॥నాదో॥ |
| అను పల్లవి: |
| వేదోద్ధరులు వేదాతీతులు విశ్వమెల్ల నిండి యుండెడి వారలు ॥నాదో॥ |
| చరణము(లు): |
| మంత్రాత్ములు యంత్ర తంత్రాత్ములు మఱి మంత్రములన్ని గలవారలు తంత్రీలయ స్వరరాగ విలోలులు త్యాగరాజ వంద్యులు స్వతంత్రులు ॥నాదో॥ |