| అఠాణా - రూపకము |
| పల్లవి: |
| నారదగానలోల నతజనపరిపాల ॥నా॥ |
| అను పల్లవి: |
| నీరదసమనీల నిరుపమగుణశీల ॥నా॥ |
| చరణము(లు): |
నీవులేక యే తనువులు నిరతముగా నడచును
నీవులేక యే తరువులు నిక్కముగా మొలచును
నీవులేక యే వానలు నిత్యముగా గురుసును
నీవులేక త్యాగరాజు నీ గుణములనెటు బాడును ॥నా॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naaradagaanaloola natajanaparipaala ( telugu andhra )