| కీర్తనలు | త్యాగరాజు | నిత్యరూప ఎవరి పాండిత్యమేమి నడచురా |
| కాపి - రూపక |
| పల్లవి: |
| నిత్యరూప ఎవరి పాండిత్యమేమి నడచురా ని.. |
| అను పల్లవి: |
| సత్యమైన యాజ్ఞ మీర సామర్థ్యముగలదానికి ని.. |
| చరణము(లు): |
| భాను పగలు రేయి రత్నసానుఁజుట్టఁడా? పూని శేషుఁడమితభార భూమి మోయఁడా? వీనులందు గాశీపతి నీ నామముఁ బల్కఁడా? మాని త్యాగరాజవినుత మహిమాస్పదమగు నీ ముందు ని.. |