| తోడి - రూపకము |
| పల్లవి: |
| నినువినా సుఖముఁగాన నీరజనయన ॥ని॥ |
| చరణము(లు): |
| మనసుకెంతో యానందమై మై పులకించగా ॥ని॥ |
| రూపము ప్రతాపము శరచాపము సల్లాపముగల ॥ని॥ |
| కరుణారస పరిపూర్ణ వరదా మృదువార్తలుగల ॥ని॥ |
| రాగ రసిక రాగరహిత త్యాగరాజ భాగధేయ ॥ని॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ninuvinaa sukhamu.rgaana niirajanayana ( telugu andhra )