| కీర్తనలు | త్యాగరాజు | నిరవధిసుఖద నిర్మలరూప నిర్జితమునిశాప |
| రవిచంద్రిక - ఆది |
| పల్లవి: |
| నిరవధిసుఖద నిర్మలరూప నిర్జితమునిశాప ని.. |
| అను పల్లవి: |
| శరధిబంధన నతసంక్రందన శంకరాది గీయమాన సాధుమానస సుసదన ని.. |
| చరణము(లు): |
| మామవ మరకతమణినిభదేహ శ్రీరమణీలోల శ్రితజనపాల భీమపరాక్రమ భీమకరార్చిత తామసరాజసమానవదూర త్యాగరాజవినుత చరణ ని.. |