| కీర్తనలు | త్యాగరాజు | నీ చిత్తము నిశ్చలము - నిర్మలమని నిన్నే నమ్మినాను |
| ధన్యాసి - చాపు |
| పల్లవి: |
| నీ చిత్తము నిశ్చలము - నిర్మలమని నిన్నే నమ్మినాను ॥నీ॥ |
| అను పల్లవి: |
| నా చిత్తము వంచన చంచలమని - నను విడనాడకుమి; శ్రీరామ! ॥నీ॥ |
| చరణము(లు): |
| గురువు చిల్లగింజ - గురువే భ్రమరము గురుఁడే భాస్కఁరుడు - గురుఁడే భద్రుఁడు గురుఁడే యుత్తమగతి - గురువు నీ వనుకొంటి ధరను దాసుని బ్రోవ - త్యాగరాజనుత! ॥నీ॥ |