| కీర్తనలు | త్యాగరాజు | నీ దాసానుదాసుడనని పేరే యేమి ఫలము |
| హమీరు కల్యాణి - దేశాది |
| పల్లవి: |
| నీ దాసానుదాసుడనని పేరే యేమి ఫలము నీ.. |
| అను పల్లవి: |
| పేదసాధులందు నీకుఁ బ్రేమలేకఁబోయే నీ.. |
| చరణము(లు): |
| సరివారిలో నన్ను చౌకజేసితివి గాని కరుణింపలేక నీదు కర్మమనెదవుగాని నీ.. |
| రోసము లేదాయె రుచిరవాక్కులు పోయె దాసుల బ్రోచితివట త్యాగరాజిలలో నీ.. |