| నాయకి - ఆది |
| పల్లవి: |
| నీ భజన గాన రసికుల నే నెందుఁ గానరా రామ నీ.. |
| అను పల్లవి: |
| శ్రీభవ సరోజాసనాది శచీమనోరమణవంద్య ఇలలో నీ.. |
| చరణము(లు): |
సగుణ నిర్గుణపు నిజదబ్బరలను
షణ్మతముల మర్మ మష్టసిద్ధుల
వగలుచూప సంతసిల్లి గంటిని
వరాసన త్యాగరాజవినుత నీ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nii bhajana gaana rasikula nee neMdu.r gaanaraa raama ( telugu andhra )