| కీర్తనలు | త్యాగరాజు | నీకే తెలియకబోతే నేనేమి సేయుదురా? |
| ఆనందభైరవి - ఆది |
| పల్లవి: |
| నీకే తెలియకబోతే నేనేమి సేయుదురా? నీ.. |
| అను పల్లవి: |
| లోకాధారుఁడవయ్యు నాలోని ప్రజ్వలించు జాలి నీ.. |
| చరణము(లు): |
| ఎందెందుఁ జూచిన ఎందెందుఁ బలికిన ఎందెందు సేవించిన ఎందెందుఁ బూజించిన అందందు నీవని తోచేటందుకు నీ పాదార విందమును ధ్యానించిన దెందుకని త్యాగరాజసన్నుత నీ.. |