| కీర్తనలు | త్యాగరాజు | నీకే దయరాక నే జేయు పనులెల్ల నెరవేరునా |
| నీలాంబరి - త్రిపుట |
| పల్లవి: |
| నీకే దయరాక నే జేయు పనులెల్ల నెరవేరునా? రామ ॥నీకే॥ |
| అను పల్లవి: |
| ఏకోపించక నేను నీవను జ్ఞాని కేలాగు సుఖమిచ్చునే? ఓ రాఘవ ॥నీకే॥ |
| చరణము(లు): |
| మనసు నిల్వని వారు మాయా జాలముఁ జేసి మఱి ముక్తి గొననౌనే? కను సౌజ్ఞకు రాని కాంతను బలిమినిఁ గరమిడ వశమౌనే? ఓ రాఘవ ॥నీకే॥ |
| వాడుక లేని విద్యల చేత సభలోన వాదించఁ బోనౌనే? చాడి విన్నమాట మదిని నిల్ప లేని సరసుని వితమౌనే? ఓ రాఘవ ॥నీకే॥ |
| మెప్పులకై బహు ధర్మముఁ జేసిన మిగుల బ్రోవ తగునే? తప్పుమాటలుగాదు తారక నామ శ్రీ త్యాగరాజునిపైని ఓ రాఘవ ॥నీకే॥ |