| కీర్తనలు | త్యాగరాజు | నీదయరాదా |
| వసంతభైరవి - రూపకము |
| పల్లవి: |
| నీదయరాదా ॥నీ॥ |
| అను పల్లవి: |
| కాదనే వారెవరు కల్యాణరామా ॥నీ॥ |
| చరణము(లు): |
| ననుఁ బ్రోచేవాఁడని నాఁడే తెలియ ఇనవంశతిలక ఇంత తామసమా ॥నీ॥ |
| అన్నిటి కధికారివని నేఁ బొగడితి మన్నించితే నీదుమహిమకుఁ దక్కువా ॥నీ॥ |
| రామ రామ రామ త్యాగరాజ హృత్సదన నామది తల్లడిల్లఁగ న్యాయమా వేగమే ॥నీ॥ |