| కీర్తనలు | త్యాగరాజు | నీవాఁడ నే గాన నిఖిలలోక నిదాన |
| సారంగ - జంప |
| పల్లవి: |
| నీవాఁడ నే గాన నిఖిలలోక నిదాన నిమిష మోర్వఁగఁ గలనా ॥ని॥ |
| అను పల్లవి: |
| దేవాదిదేవ భూదేవ వరపక్ష రా జీవాక్ష సాధుజనజీవన సనాతన ॥నీ॥ |
| చరణము(లు): |
| సత్యంబు నిత్యంబు సమరమున శౌర్యంబు అత్యంతరూపంబు అమితబలము నిత్యోత్సవంబుగల నీకు నిజదాసుఁడని తథ్యంబుఁ బల్కు శ్రీ త్యాగరాజార్చిత ॥నీ॥ |