| కీర్తనలు | త్యాగరాజు | పట్టి విడువరాదు నా చేయి పట్టి విడువరాదు |
| మంజరి - ఆది |
| పల్లవి: |
| పట్టి విడువరాదు నా చేయి పట్టి విడువరాదు ॥ప॥ |
| అను పల్లవి: |
| పుట్టిననాఁడే నిజభక్తిని మెడఁ గట్టి గుట్టు చెదరక బ్రోచి చెయి ॥ప॥ |
| చరణము(లు): |
| నిత్యానిత్యములను బోధించి కృత్యాకృత్యములను దెలిపించి ప్రత్యేకుఁడు నీవని కనిపించి భృత్యుఁడైన త్యాగరాజు చెయి ॥ప॥ |