| కీర్తనలు | త్యాగరాజు | పతికి హారతీరె సీతా |
| సురటి - ఆది |
| పల్లవి: |
| పతికి హారతీరె సీతా ॥ప॥ |
| అను పల్లవి: |
| అతిమృదుతర సత్యభాషణునికి అఖిలాండనాథునికి సీతా ॥ప॥ |
| చరణము(లు): |
| బంగరురంగు భుజంగునిపైని చె లంగుచును మరకతాంగుఁడు మెఱపు తె ఱంగున మెఱయు తన యంగనతో బలు కంగ జూచి యుప్పొంగుచు సీతా ॥ప॥ |
| అక్కరతో నిరుప్రక్కల నిలచి త ళుక్కని మెఱయఁగ చక్కనిమోమున చుక్కలరాయని మక్కువతో సరి ముక్కెర కదలగ గ్రక్కున సీతా ॥ప॥ |
| రాజ విభాకర రాజధరామర రాజశుకాజ విరాజులు చూడఁగ రాజమానమగు గాజులు ఘల్లన రాజిత త్యాగరాజనుతునికి శ్రీ ॥ప॥ |