| కీర్తనలు | త్యాగరాజు | పరమాత్ముఁడు వెలిఁగే ముచ్చట బాగ తెలుసుకోరె |
| వాగధీశ్వరి - ఆది |
| పల్లవి: |
| పరమాత్ముఁడు వెలిఁగే ముచ్చట బాగ తెలుసుకోరె ॥ప॥ |
| అను పల్లవి: |
| హరియట హరుఁడట సురులట నరులట అఖిలాండ కోటులట యందఱిలో ॥ప॥ |
| చరణము(లు): |
| గగనానిల తేజోజల భూమయమగు మృగ ఖగ నగ తరుకోటులలో సగుణములలో విగుణములలో సతతము సాధు త్యాగరాజార్చితుఁ డిలలో ॥ప॥ |