| కీర్తనలు | త్యాగరాజు | పరలోకభయము లేక భవపాశ బద్ధు లయ్యెదరు |
| మందారి - దేశాది |
| పల్లవి: |
| పరలోకభయము లేక భవపాశ బద్ధు లయ్యెదరు ॥పరలోక॥ |
| అను పల్లవి: |
| కరి వాజి శృంగార రామ శిబి కాదు లెల్ల మనకే గలిగెనని ॥పరలోక॥ |
| చరణము(లు): |
| కొన్న కాంతలను కన్న బిడ్డలను వన్నె చీరలను వాన గుడిసెలను తిన్నగా గని దైవలోకమని తన్నుకోళ్ళలో త్యాగరాజనుత ॥పరలోక॥ |