| కిరణావళి - దేశాది |
| పల్లవి: |
| పరాకు నీ కేలరా? రామ! ॥పరాకు॥ |
| అను పల్లవి: |
చరాచరములు వసియించు, ఓ
సారసాక్షా! నా పను లనిన నీ ॥పరాకు॥ |
| చరణము(లు): |
పురాన శబరి యొసంగిన యటు నే
భుజించుకొన్న శేషమా? రామ!
ధరాతలమున గుహునివలెఁ బత్ర
తల్ప మొనర్చితినా? శ్రీ త్యాగరాజుపై ॥పరాకు॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paraaku nii keelaraa raama ( telugu andhra )