| కీర్తనలు | త్యాగరాజు | పరిపాలయ మాం కోదండపాణే |
| దర్బారు - చాపు |
| పల్లవి: |
| పరిపాలయ మాం కోదండపాణే పావనాశ్రిత చింతామణే ॥ప॥ |
| అను పల్లవి: |
| సరసిజ భవనుత చరణసరోజ సాకేతసదన దశరథతనూజ ॥ప॥ |
| చరణము(లు): |
| శేషాధిప వరభూషణ వాగ్వి శేషకృతనామ ఘోరజనిత సం తోష రవిజసంభాషణ నతజన పోషణ శుభకరవేష నిర్దోష ॥ప॥ |
| సత్యసంధ వరభృత్యపాలకా దిత్య కులోత్తమ సత్యజనావన అత్యంతసుందర నృత్యజనప్రియ స్తుత్య సుచారిత్ర నిత్యోత్సవరూప ॥ప॥ |
| సాగరమదదమన నాగారినుత చర ణగణపతిహృదయాగార పాలన జాగరూక శరణాగతవత్సల త్యాగరాజనుత నాగారితురగ ॥ప॥ |