| కీర్తనలు | త్యాగరాజు | పరియాచికమా మా మాట పదుగురిలో పొగడినది |
| వనస్పతి - ఆది |
| పల్లవి: |
| పరియాచికమా మా మాట పదుగురిలో పొగడినది ప.. |
| అను పల్లవి: |
| వెరపులను మానమున వ్యసనంబులచే గోరి శరణాగతరక్షక నిను సంతతమును శరణంబే ప.. |
| చరణము(లు): |
| ఒకమునికై ద్రౌపతి ద్వారకానిలయా శరణనగ ఒకమాటకు విభీషణుడు ఓర్వలేక శరణనగ సకలేశ్వర ప్రహ్లాదు జాలిచే శరణనగ హి త కరుండై బ్రోచితి త్యాగరాజుని మాట ప.. |