| కీర్తనలు | త్యాగరాజు | పాహి రామ రామ యనుచు భజన సేయవే |
| ఖరహరప్రియ - త్రిశ్రలఘు |
| పల్లవి: |
| పాహి రామ రామ యనుచు భజన సేయవే పా.. |
| అను పల్లవి: |
| కనికరంబు గల్గి సీత కాంతుని కనఁగా మనసు రంజిల్లఁ బల్కె మదన జనకుఁడు పా.. |
| చరణము(లు): |
| వల్వను దిద్ది సౌమిత్రి వలచి నిల్వఁగా కలువ రేకులను గేరు కనులఁ జూచెను పా.. |
| భరతుఁడావేళఁ గరఁగి కరఁగి నిల్వఁగా గరముఁబట్టి కౌగలించె వరదుఁడప్పుడు పా.. |
| చండ శత్రుఘ్నుఁడపు డఖండభక్తితో నుండ సంతసిల్లె కోదండరాముఁడు ప.. |
| మనసుఁదెలిసి కలసి హనుమంతుఁడుండఁగా చనువు మాటలాడుచుండె సార్వభౌముఁడు పా.. |
| వీరికరుణ కలిగి యెపుడువెలసియుందునో సారమైన భక్తిచే సన్నుతింతునో పా.. |
| ధర్మార్థకామమోక్షదానమేలనే మర్మమెఱుగలేని ఇంద్రశర్మమేలనే పా.. |
| బాగ కరుణఁజేసి ఎపుడు భవ్యమొసఁగునో త్యాగరాజు చేయి బట్టే దయను జూతునో పా.. |