| కీర్తనలు | త్యాగరాజు | పాహి రామచంద్ర రాఘవ హరే మాం |
| యదుకుల కాంభోజి - త్రిశ్రలఘు |
| పల్లవి: |
| పాహి రామచంద్ర రాఘవ హరే మాం పాహి రామచంద్ర రాఘవ పా.. |
| అను పల్లవి: |
| జనకసుతారమణ కావవే గతి నీవు గనుక నన్ను వేగఁ బ్రోవవే పా.. |
| చరణము(లు): |
| ఎంత వేడుకొన్న నీకు నాయందు యిసు మంత దయలేక యుండునా పా.. |
| కష్టములను దీర్పమంటిని నీవు నా కిష్టదైవ మనుకొంటిని పా.. |
| శోధనలకు నేను బాత్రమా రామ య శోధనులకు నుతి పాత్రమా పా.. |
| ఆటలనుచుఁ దోచియున్నదో లేక నా ల లాట లిఖిత మర్మమెట్టిదో పా.. |
| అంబుజాక్ష వేగఁ జూడరా నీ కటా క్షంబులేని జన్మమేలరా పా.. |
| నీవు నన్నుఁజూడవేళరా నీ కన్న కన్న తావుల నేవేడఁ జాలరా |
| నన్నుఁ బ్రోచువారు లేరురా రామ నీ కన్న దైవమెందు లేదురా పా.. |
| రాజరాజపూజిత ప్రభో హరే త్యాగ రాజరాజ రాఘవ ప్రభో పా.. |