| కీర్తనలు | త్యాగరాజు | పాహి రామదూత జగ త్ప్రాణకుమార మాం |
| వసంతవరాళి - రూపక |
| పల్లవి: |
| పాహి రామదూత జగ త్ప్రాణకుమార మాం పా.. |
| అను పల్లవి: |
| వాహినీశతరణ దశవదనసూనుతనుహరణ పా.. |
| చరణము(లు): |
| ఘోరాసురవారాంనిధి కుంభతనయ కృతకార్య పారిజాత తరునివాస పవనతుల్యవేగ పా.. |
| పాదవిజిత దుష్టగ్రహ పతితలోకపావన వేదశాస్త్ర నిపుణవర్య విమలచిత్త సతతం మాం పా.. |
| తరుణారుణవదనాబ్జ తపనకోటి సంకాశ కరధృత రఘువర సుచరణ కలిమలాభ్ర గంధవహ పా.. |
| కరుణారసపరిపూర్ణ కాంచనాద్రి సమదేహ పరమభాగవతవరేణ్య వరద త్యాగరాజనుత పా.. |