| కీర్తనలు | త్యాగరాజు | ప్రారబ్ధ మిట్టుండగ నొరుల నన బనిలేదు రామ |
| స్వరావళి - ఝంప |
| పల్లవి: |
| ప్రారబ్ధ మిట్టుండగ నొరుల ననఁ బనిలేదు రామ! నా ॥ప్రారబ్ధ॥ |
| అను పల్లవి: |
| వరద! బాల! గుణశీల! జనపాల! శూల ధరవినుత! కాలాతీత! కృపాల వాల! నా ॥ప్రారబ్ధ॥ |
| చరణము(లు): |
| ఉపకారి నేనైతే నపకారు లయ్యెదరు కృపజూచిన మిగుల నెపము లెంచెదరయా చపల చిత్తులు భక్తవేషులై నను జూచి శత్రువులయ్యెదరు శ్రీ త్యాగరాజాప్త! నా ॥ప్రారబ్ధ॥ |