| హంసనాదం - దేశాది |
| పల్లవి: |
| బంటురీతిఁ గొలు వీయవయ్య రామ ॥బం॥ |
| అను పల్లవి: |
తుంటవింటివాని మొదలైన మదా
దులఁ బట్టి నేలఁ గూలఁజేయు నిజ ॥బం॥ |
| చరణము(లు): |
రోమాంచమనే ఘనకంచుకము
రామభక్తుడనే ముద్రబిళ్లయు
రామనామ మనే వరఖడ్గము వి
రాజిల్లనయ్య త్యాగరాజునికే ॥బం॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - baMTuriiti.r golu viiyavayya raama ( telugu andhra )