| కీర్తనలు | త్యాగరాజు | బడలిక దీర పవ్వళించవే |
| రీతిగౌళ - ఆది |
| పల్లవి: |
| బడలిక దీర పవ్వళించవే ॥బ॥ |
| అను పల్లవి: |
| సడలని దురితములను తెగఁగోసి సార్వభౌమ సాకేతరామ ॥బ॥ |
| చరణము(లు): |
| పంకజాసనుని పరితాపముఁగని - పంకజాప్త కులపతివై వెలసి పంకజాక్షితో వనమునకేగి జింకను వధియించి మంకురావణుని మదమునణచి - నిశ్శంకుడౌ విభీషణునికి బంగారు లంకనొసఁగి సురలబ్రోచిన నిష్కళంక త్యాగరాజనుత రామ ॥బ॥ |