| కీర్తనలు | త్యాగరాజు | బలము కులము ఏల రామ భక్తి కారణము |
| సావేరి - రూపకం |
| పల్లవి: |
| బలము కులము ఏల రామ భక్తి కారణము వెలయు సకల సిద్ధులేల వెంట వచ్చుగాని మేను ॥బలము॥ |
| చరణము(లు): |
| నీట కాకిమీను మునుగ నిరత ముదయస్నానమా తేటకనులు కొంగగూర్ప దేవతల ధ్యానమా ॥బలము॥ |
| పత్రములను మేయు మేక బలమైన యుపాసమా చిత్రపక్షులెగయ సూర్య చంద్రులకు సామ్యమా ॥బలము॥ |
| గుహల వేషకోటులుండ గుణము కల్గు మౌనులా గహనమునను కోతులుండ ఘనమౌ వనవాసమా ॥బలము॥ |
| జంగములు బలుకకున్న సంగతిగా మౌనులా అంగము ముయ్యని బాలులు యపుడు దిగంబరురా ॥బలము॥ |
| వలచు త్యాగరాజు వరదు వర భక్తులు సేయు భక్తి చెలగు సకల జనులకెల్ల చెల్లిన కాసౌనుగా ॥బలము॥ |