| కీర్తనలు | త్యాగరాజు | బాగాయెనయ్యా నీ మాయలెంతో |
| చంద్రజ్యోతి - దేశాది |
| పల్లవి: |
| బాగాయెనయ్యా నీ మాయలెంతో బ్రహ్మకైనఁ గొనియాడఁ దరమా? బా.. |
| అను పల్లవి: |
| ఈ గారుడమును యొనరించుచును నేఁ గాదనుచు బల్కేదియును బా.. |
| చరణము(లు): |
| అలనాఁడు కౌరవుల నణచఁమన అలరి దోసమనే నరునిఁ జూచి పాప ఫలము నీకు తనకు లేదని చక్కఁగఁ బాలనము సేయలేదా? త్యాగరాజనుత! బా.. |