| బహుదారి - ఆది |
| పల్లవి: |
బ్రోవ భావమా రఘురామ
భువనమెల్ల నీవై నన్నొకని ॥బ్రో॥ |
| అను పల్లవి: |
శ్రీవాసుదేవ అండకోట్ల కు
క్షిని ఉంచు కోలేదా నన్ను ॥బ్రో॥ |
| చరణము(లు): |
కలశాంబుధిలో దయతో నమ
రులకై యదిగాక గోపి
కలకై కొండలెత్తలేదా
కరుణాకర త్యాగరాజుని ॥బ్రో॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - broova bhaavamaa raghuraama ( telugu andhra )