| కీర్తనలు | త్యాగరాజు | భక్తుని చారిత్రము వినవే మనసా |
| బేగడ - ఆది |
| పల్లవి: |
| భక్తుని చారిత్రము వినవే మనసా సీతారామ ॥భక్తుని॥ |
| అను పల్లవి: |
| ఆసక్తిలేక తాఁ గోరు జీవ న్ముక్తుఁడై యానందము నొందు ॥భక్తుని॥ |
| చరణము(లు): |
| జప తపములు తా జేసితి ననరాదు అదిగాక మఱి కపటాత్ముఁడు మనమై బల్క రాదు ఉపమ తనకు లేక యుండవలెనని యూరయూర తిరుగగ రాదు చపల చిత్తుఁడై యాలు సుతులపై సాంకు భ్రమ కారాదను హరి ॥భక్తుని॥ |
| భవ విభవము నిజమని యెంచగరాదు అదిగాక మఱి శివ మాధవ భేదము జేయగ రాదు భువన మందు దానే యోగ్యుఁడనని బొంకి పొట్ట సాకగ రాదు పవనాత్మజ ధృతమౌ సీతాపతి పాదములను యేమర రాదను హరి ॥భక్తుని॥ |
| రాజస తామస గుణములుగా రాదు అది గాకేను అ వ్యాజమునను రాలేదన గారాదు రాజయోగ మార్గము నీ చిత్తము రాజూచుట విడవగ రాదు రాజ శిఖామణి యైన త్యాగ రాజ సఖుని మరవ రాదనే హరి ॥భక్తుని॥ |