| కీర్తనలు | త్యాగరాజు | భజన సేయరాదా? రామ |
| అఠాణ - రూపకం |
| పల్లవి: |
| భజన సేయరాదా? రామ ॥భజన॥ |
| అను పల్లవి: |
| అజ రుద్రాదులకు సతత మాత్మ మంత్రమైన రామ ॥భజన॥ |
| చరణము(లు): |
| కరకు బంగారు వల్వ కటి నెంతో మెరయగ చిరు నవ్వులు గల మొగమును చింతించి చింతించి ॥భజన॥ |
| అరుణాధరమున సురుచిర దంతావళిని మెరయు కపోల యుగమును నిరతమునను దలచిదలచి ॥భజన॥ |
| బాగుగ మానస భవ సాగరమునను తరింప త్యాగరాజు మనవిని విని తారకమగు రామనామ ॥భజన॥ |