| కీర్తనలు | త్యాగరాజు | భజన సేయవే మనసా పరమ భక్తితో |
| కల్యాణి - రూపకం |
| పల్లవి: |
| భజన సేయవే మనసా పరమ భక్తితో ॥భజన॥ |
| అను పల్లవి: |
| అజరుద్రాదులకు భూసు రాదుల కరుదైన రామ ॥భజన॥ |
| చరణము(లు): |
| నాద ప్రణవ సప్తస్వర వేద వర్ణ శాస్త్ర పురా ణాది చతుష్షష్ఠి కళల భేదము గలిగె మోదకర శరీర మెత్తి ముక్తి మార్గమును దెలియక వాద తర్కమేల శ్రీమ దాది త్యాగరాజనుతుని ॥భజన॥ |