| కీర్తనలు | త్యాగరాజు | భజనపరులకేల దండ - పాణి భయము మనసా! రామ |
| సురటి - రూపకము |
| పల్లవి: |
| భజనపరులకేల దండ - పాణి భయము మనసా! రామ॥భ॥ |
| అను పల్లవి: |
| అజ రుద్ర సురేశుల - కాస్థానమొసంగు రామ ॥భ॥ |
| చరణము(లు): |
| అండకోట్ల నిండిన కో - దండిపాణి ముఖమును హృత్ పుండరీకమునఁజూచి - పూజ సల్పుచు నిండుప్రేమతోఁ గరంగు - నిష్కాములకు వరవే దండ పాలు దాసుఁడైన - త్యాగరాజుసేయు నామ ॥భ॥ |