| కల్యాణి - ఆది |
| భజరే రఘువీరం శర - భరిత దశరథకుమారం ॥భ॥ |
| నీవు దురాసల రోసి పర - నిందల నెల్లను బాసి ॥భ॥ |
| పంచేంద్రియమ్ముల నణఁచు - ప్రపంచసుఖము విస మనుచు ॥భ॥ |
| కామాదుల నేగించి నీ - కార్యములను సాధించి ॥భ॥ |
| అన్నియు పనికొదిగేనా ఇటు - అటు తిరిగినఁ దెలిసేనా ॥భ॥ |
| వేఱే పనులకుఁ బోక గోముఖ - వ్యాఘ్రము చందముగాక ॥భ॥ |
| తప్పుతంటలనుమాని భవ - తరణమునను మతిఁబూని ॥భ॥ |
| కర్మముహరికి నొసంగి సత్ - కార్యములం దుప్పొంగి ॥భ॥ |
| భక్తిమార్గమును దెలిసి నిజ - భాగవతుల జతకలసి ॥భ॥ |
| మాయారహితుని గొలిచి నీ - మనమున రామునిఁ దలఁచి ॥భ॥ |
| రాజాధిపుగా వెలసి త్యాగ - రాజ వరదుఁడని దెలిసి ॥భ॥ |