| జయనారాయణి - ఆది |
| పల్లవి: |
| మనవిని వినుమా, మఱవ సమయమా? ॥మనవిని॥ |
| అను పల్లవి: |
కనుగొనగోరి దుష్కల్పన మానితి
కనికరమున నిను బాడుచున్న నా ॥మనవిని॥ |
| చరణము(లు): |
పరులకు హితమగు భావన గాని
చెరచు మార్గముల జింతింపలేను
పరమ దయాకర! భక్తమనోహర!
ధరాధిప కరార్చిత! త్యాగరాజ ॥మనవిని॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - manavini vinumaa, marava samayamaa? ( telugu andhra )