| కీర్తనలు | త్యాగరాజు | మనసా ఎటులోర్తునే నా |
| మలయమారుతము - రూపకము |
| పల్లవి: |
| మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే ఓ ॥మ॥ |
| చరణము(లు): |
| దినకరకుల భూషణుని దీనుఁడవై భజనఁజేసి దినముఁ గడుపమనిన నీవు వినవదేల గుణవిహీన ॥మ॥ |
| కలిలో రాజస తామస గుణములు - గలవారి చెలిమి కలిసిమెలసి తిఱుగుచు మఱి - కాలము గడపకనే సులభముగాఁ గడతేరను - సూచనలను దెలియఁజేయు ఇలను త్యాగరాజుమాట - వినవదేల గుణవిహీన ॥మ॥ |